EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఢిల్లీ ప్రెస్ మ్యాగజైన్ గ్రూప్ స్టాల్ ను సందర్శించిన జై స్వరాజ్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కాసాని శ్రీనివాస గౌడ్

హైదరాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూస్) హైదరాబాద్ లో జరుగుతున్న 36 వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ లో ప్రముఖ ప్రచురణ సంస్థ ఢిల్లీ ప్రెస్ ఎర్పాటు చేసిన బుక్ స్టాల్ ను జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు కాసాని శ్రీనివాస రావు గౌడ్ సందర్శించారు _._ ఈ సంధర్భంగా ఆయన మాట్లడుతూ ఢిల్లీ ప్రెస్ కి ఎంతో చరిత్ర ఉందని ప్రస్తుతం 30 మ్యాగజైన్ లను తొమ్మిది భాషల్లో ముద్రిస్తోందని చెప్పారు. దేశ విదేశాల్లో పాఠకులు ఉన్న ఈ మాగజైన్ గ్రూప్ కి ఆరు వెబ్సైట్లు,2.1 కోట్ల పాఠకులు ఉన్నారని వివరించారు.వీరు ప్రచురిస్తున్న పత్రికలు పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగ పడే విధంగా ఉన్నాయన్నారు.పుస్తక పఠనం తగ్గిపోయిన ఈ రోజుల్లో పత్రికలను నడపడం కష్టం.కానీ ఈ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా మంచి లిటరేచర్ అందిస్తున్నదని ఇది అభినందించాల్సిన విషయమన్నారు.ఈ సందర్శన లో వీరితో పాటు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక అభ్యర్థి ఆర్ యస్ జే థామస్, పార్టీ నాయకులు ఇస్మాయిల్, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top