EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రోగికి వెస్సో చేయూత

హైదరాబాద్ ఫిబ్రవరి 13 (ఈ బీ న్యూస్ );హైదరాబాద్ వనస్థలిపురం నివాసి గురజాపు సత్య శ్రీనివాస్ చక్రవర్తి(59) చిరుద్యోగం చేస్తున్న అవివాహితుడు. అతడు, అవివాహితుడు అయిన మరొక తమ్ముడు, వివాహ సమస్యలతో విడాకుల కొరకు న్యాయ పోరాటం చేస్తున్న మరొక తోబుట్టువు కలిసి ఉంటున్నారు. శ్రీనివాస్ కు గత నెలలో ఆరోగ్యశ్రీ లో ప్రొస్టేట్ సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన కొద్ది రోజుల లోనే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై ఒక ట్రస్ట్ ఆసుపత్రిలో గత పది రోజులుగా ఐసీయు లో చికిత్స పొందుతున్నారు.జీవనోపాధి నిమిత్తం పూజలు నిర్వహించే ఆయన తమ్ముడు కాశీ విశ్వనాధం ఇప్పటి వరకు వైద్య ఖర్చుల నిమిత్తం తాను ఆదా చేసుకొన్న 2 లక్షల రూపాయలు ఖర్చు చేసారు. వైద్యానికి మరో రూ. 70,000/- వరకు ఖర్చు ఆయ్యే పరిస్థితి. మిగిలిన వైద్యానికి అప్పు కూడా పుట్టని స్థితిలో, ఆర్థిక సహాయం కోసం కాశీ విశ్వనాధం వెస్సో ను ఆశ్రయించారు. వెస్సో గౌరవ దాతల సహకారంతో తన అన్న వైద్యానికి కాశీ విశ్వనాధానికి రూ.43,600/-లు అందజేసింది. వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యం కొరకు ఆర్థిక ఇబ్బందులు పడుతూ ప్రాణాపాయంలో ఉన్న తోటి సోదరుడికి సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top