EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విభిన్నంగా వినూత్నంగా కొన సాగుతున్న నిత్య జన గణ మన

హైదరాబాద్ ఫిబ్రవరి 13  ఈతరం భారతం ప్రతినిధి : నిత్య జనగణమన విభిన్నంగా వినూత్నంగా కొనసాగుతున్నది. భారత కోకిల సరోజినీ నాయుడు 145వ జయంతి ఉత్సవాలను నిత్య జనగణమన కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నేత శ్రీమతి దేవిరెడ్డి విజితా రెడ్డి అతిథిగా విచ్చేశారు. ముందుగా సరోజినీ నాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని అందరితో కలిపి ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ నాయకులు చేసిన కృషి, ప్రత్యేకించి సరోజినీ నాయుడు జాతీయ ఉద్యమంలో పాల్గొన్న తీరు ప్రస్తుతం ప్రతి ఒక్క మహిళకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని కొనియాడారు. సమకాలిన రాజకీయాల గురించి నిర్వాహకులతో పలు విషయాలను చర్చించారు కార్యక్రమంలో నిత్య జనగణమన నిర్వాహక సంస్థ వందే ప్రజ ప్రతినిధులు నేలంటి మధు, వందే ప్రజ శ్రీనివాస్, ఉపేంద్ర ప్రసాద్ దూబే, డిఎన్ రావు, స్థానిక మహిళ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top