హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ఈ బీ న్యూ స్);: ఎర్ర రక్త కణాల (RBC) సగటు జీవిత కాలము 110 మొదలు 112 రోజులు మాత్రమే అని, ఈ కాల వ్యవధి అనంతరం అవి శరీరంలో నశించిపోతాయి అని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి అన్నారు. బాలాజీ నగర్ లో మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ ఎర్ర రక్త కణాల స్థానములో కొత్తవి చేరతాయి అని. ఈ క్రమ విధానములో ప్రతి మానవునిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు రక్త దానము చేయకపోయినా ఎర్ర రక్త కణాలు నశించిపోతాయి, కాబట్టి రక్తదానం చేయడమే మంచిది అని, మన శరీరంలో సహజంగా నశించిపోయేలా చేయటం కంటే సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని మదర్ మేరి చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ లిల్లీ మేరి అన్నారు.















