హైదరాబాద్ ఫిబ్రవరి 14 (ఈ బీ న్యూ స్);: బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఏలేటీ మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ హై కమాండ్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఫ్లోర్ లీడర్‌తో పాటు మిగతా సభ్యులను కూడా అధిష్ఠానం నియమించింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పాయల్ శంకర్, చీఫ్ విప్‌గా పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్‌గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రా..మారావు పాటిల్‌ను బీజేపీ హై కమాండ్ నియమించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 8 సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే.కాగా.. ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరును బీజేపీ హై కమాండ్ ఖరారు చేసింది.
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు
గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్ . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మర్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. మహారాష్ట్రలో అశోక్ చవాన్‌తో పాటు మేథా కులకర్ణి, అజిత్ గోప్చడేలను బీజేపీ నామినేట్ చేసింది.
ఉత్తరప్రదేశ్ నుంచి ఏడుగురు నామినేషన్
బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన ఏడుగురు అభ్యర్థులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో బుధవారంనాడు నామినేషన్ వేశారు. వీరిలో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్‌వీర్ సింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదగర్శి ఆమ్రపాల్ మౌర్య, రాష్ట్ర మాజీ మంత్రి సంగీత బల్వంత్, పార్టీ ప్రతినిధి సుధాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్ ఉన్నారు. నామినేషన్ సందర్భంగా సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, బీజేపీ యూపీ లోక్‌సభ ఇన్‌చార్జి బైజయంత్ పాండే హాజరయ్యారు. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది.















