EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

క్రిస్టియన్ మైనార్టీలపై ఆర్ఎస్ఎస్ దాడి అమానుషం   బిఎస్పి జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు

15.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత. (ఈ బీ న్యూస్)క్రిస్టియన్ మైనార్టీలపై ఆర్ఎస్ఎస్ దాడి అమానుషమని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం, జన్వాడ గ్రామంలో మెథడిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న క్రిస్టియన్ మైనారిటీలపై దాడికి వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుర్ర ఉపేంద్ర సాహు మాట్లాడుతూ… జన్వాడలో బిజెపి, ఆర్ఎస్ఎస్ గుండాలు, మనువాద ఆధిపత్యకుల పార్టీలకు సంబంధించిన నాయకులు మూకుమ్మడిగా, అమానుషంగా మెథడిస్ట్ చర్చిలోకి చొరబడి విచక్షణా రహితంగా ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి 50 మందికి పైగా గాయపరచడం అత్యంత దుర్మార్గ చర్య అన్నారు. నిత్యం దేశభక్తి గురించి మాట్లాడే బిజెపి.. పైన పటారం లోన లోటారం అన్నట్టుగా దానిమాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ గుండాలతో కలసి ఈ దుశ్చర్యకు పాల్పడడం హేయమైన చర్య అన్నారు. ఆర్ఎస్ఎస్ తో పాటు ఆధిపత్య పార్టీలకు సంబంధించిన నాయకులు అహంకారంతో దళిత క్రైస్తవులను కొట్టి గాయపరచడమే కాకుండా హతమార్చాలని ప్రయత్నించారని దుయ్యబట్టారు. ఈ దాడిలో 50 మందికి పైగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. రాష్ట్ర రాజధానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఈ దుశ్చర్య జరిగిందంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బహుజనుల శ్రేయోభిలాషి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళుతున్న క్రమంలో మార్గమధ్యంలోనే అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్న బిఎస్పి మినహా, ఇప్పటివరకు ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ దాడి గురించి మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నటువంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అన్నారు. దాడిలో పాల్గొన్న దుండగులందరినీ వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ బాధితులకు అండగా ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టడానికైనా వెనకాడదని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జీలు ఎం పుల్లయ్య, నారపోగు ఉదయ్, జిల్లా ఉపాధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శులు అయితగాని శ్రీనివాస్ గౌడ్, బి ఉపేందర్, పల్లెపోగు విజయ్, బచ్చలకూరి బాలరాజు, నాయకులు దారెల్లి రమేష్, షేక్ అఫ్జల్, వంశీ, శ్రీనివాస్, నెమలి శ్రీకాంత్, రాజీవ్, బొడ్డు బాబురావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top