EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అక్రమ నిర్మాణాలతో పర్యావరణానికి పెరుగుతోన్న ముప్పు నిర్మాణాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి

హైదరాబాద్ ఫిబ్రవరి 16 (ఈ బీ న్యూ స్);: అక్రమ నిర్మాణాల కారణంగా పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆరోపించింది. నిర్మాణదారులు ఆయా నిర్మాణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని విస్మరించడం, నిబంధనల మేరకు ఇంకుడుగుంటలు ఏర్పాటు చేయకపోవడం, అనుమతులకు మించి పెంట్ హౌస్ లాంటి నిర్మాణాలకు తెగబడుతున్నారని, ఈ రకమైన నిబంధనల విధ్వంసం వల్ల మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడి వ్యవస్థ అస్తవ్యస్థమవుతోందని కౌన్సిల్ అధ్యక్షులు రంగయ్య శుక్రవారం విలేకరులతో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ -హెచ్ఎండీఏ అధికారుల వైఫల్యం మహానగరంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, దీనివల్ల నగర వ్యాప్తంగా నిత్యం మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని మండిపడ్డారు. ఎన్ఓసీ కోసం తాత్కాలికంగా పచ్చదనం చూపి తర్వాత ఆ పచ్చదనాన్ని గంగలో కలుపుతున్నా అధికారులు మౌనముద్ర పాటిస్తున్నారని ఏద్దేవా చేశారు. నిర్మాణ దారుల తీరువల్ల పర్యావరణ బలోపేతానికి విఘాతం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు పర్యావరణ సమతుల్యత బలహీనపడుతున్న తరుణంలో దాని బలోపేతం కోసం నడుం కట్టిన కౌన్సిల్ ఉదాసీనత పాటిస్తున్న అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నిబంధనలు తృణీకరించిన నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక నేతల ఒత్తిడితో జరిగిన ఈ అక్రమాలపై అధికారులు దృష్టి సారించాలని, భవిష్యత్ నిర్మాణాలు పారదర్శకంగా ఉండేలా చూడాలని రంగయ్య కోరారు.

 

Related News

Select the Topic
Scroll to Top