హైదరాబాద్ ఈ బీ న్యూస్ ప్రతినిధి: ప్రముఖ సేవా సంస్థ” అస్తిత్వం” సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధు కు 2024 ఉత్తమరాష్ట్ర స్థాయి పాత్రికేయ పురస్కారం ప్రకటించింది. ఫిబ్రవరి 21 వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డ్ అందజేయనున్నట్లు సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రెటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీమతి జి. కళార్చన , గౌరవ అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరి కృష్ణ హాజరు కానున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు















