హైదరాబాద్ ఫిబ్రవరి 17 (ఈ బీ న్యూస్);తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె కేసీఆర్‌కు ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు.గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన ఓ ప్రతినిధి.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ రాసిన లేఖను, పుష్పగుచ్ఛాన్ని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అందజేశారు.గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శభాకాంక్షలు.వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.















