EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అసెంబ్లీలో విశ్వాస తీర్మానం లో నెగ్గిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

న్యూ డిల్లీ ఫిబ్రవరి 17 (ఈ బీ న్యూ స్);ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని నెగ్గారు .ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్‌.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్‌ చేసిందని విమర్శించారు.కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి సవాల్‌ విసిరే పార్టీ ఆమ్‌ ఆద్మీపార్టీనే అని అన్నారు. అందుకే తమను చూసి కమలం పార్టీ ఆందోళన చెందుతోందని, తమ పార్టీని దెబ్బతీయాలని చూస్తోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా.. 2029లో మాత్రం ఆ పార్టీని తాము తప్పక ఓడిస్తామని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ధీమా వ్యక్తం చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top