EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మరో 62 మంది డీఎస్పీలకు స్థానచలనం

హైదరాబాద్‌ ఫిబ్రవరి 18 (ఈ బీ న్యూస్);: తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 62 మంది డీఎస్పీలకు స్థానచలనం కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను బదిలీ చేసింది. డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్‌లో ఉన్న డీఎస్పీ లందరికీ పోస్టింగ్‌ ఇచ్చారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 300 పై చిలుకు డీఎస్పీలను బదిలీ చేసింది. అయితే, రాబోయే రోజుల్లో మరికొన్ని శాఖల్లోనూ అధికారుల బదిలీలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.

 

 

Related News

Select the Topic
Scroll to Top