EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సత్యనారాయణ గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ డిమాండ్

హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఈ బీ న్యూ స్) :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన సత్యనారాయణ గౌడ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. అక్రమాలపై అవగాహన ఉన్నదని తప్పుడు కూతలు కూస్తూ వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నాడని తెలంగాణ ఉద్యోగుల సంఘం సెంట్రల్ అసోసియేషన్ సభ్యుడు, ఐపీఎo రాష్ట్ర అధ్యక్షుడు జి మహేష్ కుమార్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, ఉపాధ్యక్షులు మొహమ్మద్ గౌస్ పాషా లు తీవ్రంగా విమర్శించారు. సత్యనారాయణ గౌడ్ స్థాయి అటెండర్ నుంచి టెక్నికల్ అసిస్టెంట్ అయిన ఇతడు ఉద్యోగంకు రాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన గురించి చెప్పే అంత స్థాయా అతనిది కాదని, అక్రమంగా పెట్టిన బోర్డులను రెవిన్యూ అధికారులు తొలగిస్తే, ప్రైవేటు వ్యక్తులు తొలగించారని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్య బట్టారు.మంగళవారం ఐపీఎం కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ శేరిలింగంపల్లి ఎమ్మార్వో మల్లయ్య, ఆర్ ఐ రాంబాబు కూలగొట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. వారిని మేనేజ్ చేసి కూలగొట్టిన బోర్డులను వెంటనే తొలగించి దాచేయలేదా?ఉద్యోగస్తుల నుంచి డబ్బులు అక్రమంగా, మోసం చేసి వసూలు చేసిన నీవు కించపరిచినట్లు మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసారు. లేదంటే తెలంగాణ ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంగ్రెస్ కార్యకర్తలు భాగ్యనగర అసోసియేషన్ పనిపాడతారని హెచ్చరించారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top