EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

 

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా

తాడేపల్లి ఫిబ్రవరి 21 (ఈ బీ న్యూస్ );: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్‌సీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరక సీఎం జగన్‌కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా అధికార పార్టీకి బైబై చెప్పేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రాజకీయ భవిష్యత్ ప్రణళికలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

Related News

Select the Topic
Scroll to Top