హైదరాబాద్ ప్రతినిధి ఈ బీ న్యూస్ 22.02.2024 :ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అస్తిత్వం హైదరాబాద్ రవీంద్ర భారతి లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఎర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానం – 2024 కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, రచయిత, రాజకీయ విశ్లేషకులు నేలంటి మధుకు ఉత్తమ పాత్రికేయ పురస్కారం అందజేసింది.ఈ పురస్కారాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరబాద్ సిటీ సివిల్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ సెక్రెటరీ శ్రీమతి జి. కలార్చాన చేతుల మీదుగా నేలంటి మధు అందుకున్నారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథి లుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం రిటైర్డ్ విజిలెన్స్ అదనపు కార్యదర్శి, న్యాయవాది, సామాజిక కార్యకర్త శ్రీమతి జి.కృష్ణవేణి హాజరయ్యారు. సంస్థ నిర్వహకులు మంజుల ఈ సందర్భంగా మధు కి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. న్యూస్ పోర్టల్ ఈతరం భారతం డాట్ కామ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు.















