హైదరాబాద్ ఫిబ్రవరి 22 (ఈ బీ న్యూస్ ): త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న లేదా 29వ తేదీన ఈ గ్యారంటీలను గవర్నమెంట్ ప్రారంభించనుంది. ఈ మేరకు గ్యారంటీల అమలుకు సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.గృహజ్యోతి పథకానికి అర్హులైన వారి మార్చి మొదటి వారంలో జీరో బిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. లబ్దిదారులు రూ.500 చెల్లిస్తే సిలిండర్ అందించేలా ప్రణాళిక సిద్దం సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ లబ్ధి జరిగేలా చూడాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొత్త దరఖాస్తు చేయాలనుకునేవారు ఎంపీడీవో, తహశీల్దార్ ఆఫీసుల్లో అప్లై చేసుకోవచ్చని సూచించారు.















