EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చట్టం తన పని తానే చేసుకుంటుంది.. షర్మిల అరెస్ట్ తనకు తెలియదు    మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి, ఫిబ్రవరి 23 (ఈ బీన్యూస్ )  ‘‘ఛలో సెక్రటేరియట్‌’’ బయలుదేరిన వైఎస్ షర్మిలను (గురువారం) పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. షర్మిల అరెస్ట్ వార్త అందరికీ తెలిసిందే. అయితే మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం.. షర్మిల అరెస్ట్ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యయుతంగానే ఉంటామని… చట్టం తన పని తానే చేసుకుంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు తపస్సులు చేసుకుంటాయా ?… సభలు సమావేశాలు పెట్టుకోవాలిగా అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘మా ప్రాంతం వైపు సంక్రాంతి అప్పుడు వేషాలను వేసుకొస్తారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి… వాళ్ల వేషాలతో వస్తారు… నా మీద ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా.. ప్రతిపక్ష పార్టీల నుండి గంటా పోటీ చేస్తే చేయమనండి.. పోటీ చేసే ఆ ఒక్కరే గంటా అవుతారేమో. నియోజకవర్గం మారిన ప్రతిసారి గంటా గెలిస్తే… ఈ సారి రికార్డ్ తప్పుతుంది ఏమో’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top