EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కర్నూలు జిల్లాలో వైసీపీకు భారీ షాక్

కర్నూలు ఫిబ్రవరి 23 (ఈ బీ న్యూస్);: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ కి భారీ షాకులు తగులుతున్నాయి. ఫ్యాన్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలంతా వైసీపీను వీడి టీడీపీ లో చేరారు. దాంతో ఓర్వకల్లులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన 200 వైసీపీ కుటుంబాలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.పసుపు కండువా కప్పి టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకట రెడ్డి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌రెడ్డి పాలనకు చరమగీతం పాడుతామని ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు హెచ్చరించారు. జగన్ పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతోనే ఆ పార్టీని వీడామని వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ప్రాధాన్యం కల్పిస్తామని గౌరు చరితారెడ్డి తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top