EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గొర్రెల కుంబకోణం లో తలసాని పీఏ హస్తం..      టీపీసీసీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ఈ బీ న్యూ స్);: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని టీపీసీసీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాగ్ నివేదికలో గత కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలు పూర్తిగా బయటపడ్డాయని అన్నారు. గొర్రెలు పంపిణీ చేసిన వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. రూ.142 కోట్ల విలువైన గొర్రెల వివరాలు లెక్కలు లేవని చెప్పారు. గొర్రెల పంపకాలపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. డిసెంబర్ 10వ తేదీన మాసబ్ ట్యాంక్‌లోని ఎనిమాల్ హజీబెండరీ ఆఫీస్ నుంచి పత్రాలు దొంగతనం చేశారని తెలిపారు.ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హస్తం ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు. ఇప్పుడు కేవలం నలుగురు అధికారులను బాధ్యులను చేసి ప్రభుత్వం ఊరుకుంటే అసలు దోషులు బయటపడరని అన్నారు. తప్పు చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చేపల పంపిణీలలో కూడా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. గొర్రెలు, చేపల పంపిణీలపై లెక్కలు తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై కూడా వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ జరపాలని నిరంజన్ డిమాండ్ చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top