ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి 28.3.24 : యాదాద్రి భువనగిరి జిల్లా పెద్దకందుకూరు గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా హరిత ఆధ్వర్యంలో మూడవ రోజు గురువారం కొనసాగింది. ఇందులో భాగంగా వాలంటీర్స్ ప్రైమరీ, ఉన్నత పాఠశాల ప్రాంగణాలను శుభ్రం చేశారు. ప్రసిద్ధ కవి, విద్యావేత్త డా. తిరునగరి శ్రీనివాస్ ముఖ్య వక్త గా విచ్చేసి వాలంటీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల అధ్యాపకులు డా . సత్య నారాయణ, బాలరాజు, ఉదయభాస్కర్, వాలంటీర్స్ నర్మద, ఇందు, పవన్, సాయి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.















