EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పులి సంగప్ప గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి మార్చ్ 28 (ఈతరం భారతం న్యూస్ ):సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో అమ్మ ఒడి హోటల్లో పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం మరియు మిత్రబృందం ఆధ్వర్యంలో పులి సంఘప్ప గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంగప్ప గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ ప్రతి మనిషి పుట్టడం సహజమే అలాంటి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నామంటే అట్టి పుట్టినరోజు నలుగురికి ఆదర్శంగా ఉండేలా మనిషి పుట్టినప్పటి నుండి అతని యొక్క కాలాన్ని సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటే నలుగురికి ఆదర్శంగా, మార్గదర్శకంగా, చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందని కొనియాడుతూ అట్టి పుట్టినరోజుకు నిదర్శనంగా పులి సంఘప్ప గౌడ్ జన్మదిన వేడుకలను గుర్తించదగ్గ విధంగా చెప్పుకోవచ్చని తెలియజేశారు.ఈ యొక్క జన్మదిన వేడుకలలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ కూరెళ్ళ సదానంద్, కరాటే మాస్టర్ అశోక్, మోమిన్ పెట్ మండలం బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మరియు మిత్ర బృందం పాల్గొన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top