29.3.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ ఖమ్మం
ఖమ్మం రూరల్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గెలుపుని కోరుతూ గుదిమళ్ల గ్రామానికి చెందిన రానేరు మురళి అనే అభిమాని తిరుపతమ్మ తల్లి, గోపయ్య స్వామికి ప్రభలు ఏర్పాటు చేస్తానని మొక్కుకున్నాడు. ఈ సందర్భంగా ఆ మొక్కును శుక్రవారం తీర్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతోనే పొంగులేటి ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మీర అశోక్ నాయక్, కొప్పుల చంద్రశేఖర్ , రానేరు యాదగిరి, సూదగాని ఉపేందర్, గునిగంటి రమేష్, కర్లపుడి భద్రకాళి, సైదులు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, పేరం భరత్, యాదగిరి, శ్రీనాథ్, వేముల రవి తదితరులు పాల్గొన్నారు.















