EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆసిఫ్‏నగర్‌ పోలీస్ స్టేషన్‌లోని పార్కింగ్‌ స్థలంలో అగ్నిప్రమాదం సంఘటనలో 50 ద్విచక్ర వాహనాలు దగ్దం

హైదరాబాద్ మార్చ్ 29 (ఈతరం భారతం న్యూస్ ):: ఆసిఫ్‏నగర్‌ పోలీస్ స్టేషన్‌లోని పార్కింగ్‌ స్థలంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో 50 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్ నగర్‌ గాంధీ విగ్రహం వద్ద పాత ఆసిఫ్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన స్థలం ఉంది. అందులో కొన్నిరోజులుగా పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఉంచారు. గురువారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో వాహనాల వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒకదానికి వెంట మరొకటి అంటుకుని 50 వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలాన్ని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top