EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

స్వేచ్చాయుత న్యాయమైన ఎన్నికలపై సెమినార్

హైదరాబాద్ మార్చి 29 (ఈతరం భారతం న్యూ స్);మార్చి 30న బేగంపేటలోని టూరిజం ప్లాజాలో హైదరాబాద్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సెమినార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ కె.ఎస్.రంగ సాయి తెలిపారు. ఈ సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర సమాచార, దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ తదితరులు హాజరవుతారని చెప్పారు. సెమినార్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా పత్రికల సంపాదకులు, రిపోర్టర్లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కెఎస్ రంగసాయి కోరారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top