EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆలేరు ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ప్రతినిధి 30.3.24 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరం లో భాగంగా ప్రోగ్రామ్ అధికారిణి డా హరిత ఆధ్వర్యంలో శనివారం రక్త దాన శిబిరం జరిగింది.మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డాక్టర్ మద్దిలేటి పసుపుల రక్త దానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాలంటీర్స్ రాజు, సాయిప్రకాష్, సిబ్బంది ఉదయభాస్కర్, మమత, బాలరాజు తదితరులు రక్త దానంలో చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి లక్ష్మణ్ నాయక్ అధ్యక్షత వహించారు. డాక్టర్ సి హేచ్ సత్యనారాయణ, డాక్టర్ రేవతి, డాక్టర్ జయపాల్, రాజు, వెంకటేశం, నందకుమార్, మల్లేశం, ముత్యాలు, విద్యాసాగర్, సరిత అనురాధ, శ్రీనివాస్, సైదులు, రేవంత్ పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top