EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బీఆర్ఎస్ నేతలు పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకు   నా రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు : కడియం

వరంగల్ మార్చ్ 30 (ఈతరం భారతం న్యూస్ );: బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు. పార్టీ మారుదామా వద్దా అని కార్యకర్తలను కడియం అడిగారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేమని కడియంకు కార్యకర్తలు చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటామని ఏక వాక్య తీర్మానాన్ని కడియం శ్రీహరి అనుచరులు చేశారు. అయితే కార్యకర్తల నిర్ణయాన్ని బట్టి తాను నడుస్తానని కడియం తెలిపారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి భయమెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు పసునూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం తన విషయంలో ఎందుకని నిలదీశారు. తన రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని చెప్పారు. తనపై ఒక్క పెట్టి కేసు కూడా లేదన్నారు. తన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. ఉద్యమ కారులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని తెలిపారు. జిల్లాల్లో పక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి జరిగిందని.. ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే వెనుకపడిందని కడియం శ్రీహరి అన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top