EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

క్రైస్తవులకు నామ ఈస్టర్ శుభాకాంక్షలు చెడుపై మంచి విజయమే ఈస్టర్  ఎంపీ నామ నాగేశ్వరరావు

30 – 03 -2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధులత ఖమ్మం.

క్రైస్తవ సోదర సోదరీమణులు అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మానవాళికి పాప విముక్తిని కల్పిస్తూ ఏసు క్రీస్తు తనని తాను త్యాగం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడ్ అయితే..తిరిగి వచ్చిన రోజు ఈస్టర్ ఎంతో పవిత్రమైనదని అన్నారు. దేవుడు తిరిగొచ్చినందుకు ఈస్టర్ ని సందడిగా జరుపుకుంటారని, క్రైస్తవులు ఏసుని నిజమైన దేవుడిగా గుర్తించిన రోజే ఈస్టర్ అన్నారు. చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని చెప్పడమే ఈస్టర్ ఆంతర్యం అన్నారు. ఈ రోజున ప్రార్థనలు చేస్తారు, విందులో పాల్గొంటారు. ఎగ్ రోలింగ్, ఎగ్ ట్యాపింగ్, ఎగ్ డెకొరేషన్ వంటి సాంప్రదాయ ఈస్టర్ గేమ్‌లు ఆడతారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు, సన్నిహితులకు, స్నేహితులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.ప్రేమ, శాంతి, అహింసా మార్గంలో మానవాళి యావత్తూ నడుచుకోవాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారుప్రాణత్యాగం చేసిన క్రీస్తు మూడో రోజే సజీవుడై తిరిగొచ్చిన పవిత్ర దినం ఈస్టర్ అని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంవెల్లివిరియాలని ప్రార్థిస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ అని కొనియాడారు.దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూహ్యాపీ ఈస్టర్ అన్నారు.మీకు ఆనందం , ఆరోగ్యంతో కూడిన ఆశీర్వాదం ఆ దేవుడు అందించాలన్నారు.ఏసు ప్రేమ , త్యాగం గురించి ప్రతిబింబించే సమయం ఇతరులకు సేవ చేయడానికి మీకు స్ఫూర్తినివ్వాలన్నారు.యేసుక్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానం పొందడానికి సూచికగా ఈస్టర్ ను ఘనంగా జరుపుకుంటారని అన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన అని, మరణం అంతం కాదని పాప విముక్తి కొత్త జీవితానికి ఇది నాంది అనే ఒక ఆశను ప్రజలకు అందిస్తుందని నామ నాగేశ్వరరావు అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top