EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాబోయే ఎన్నికలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్

30.3.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధులత. ఖమ్మం.

ఎన్నికల నోడల్ అధికారులు, తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా చేపట్టాలని, రాబోయే ఎన్నికలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎన్నికల నోడల్ అధికారులతో, ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, వందకు వంద శాతం సక్సెస్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందిలో ఓటు హక్కు ఇతర నియోజకవర్గాల్లో ఉంటే, వెంటనే తమ ఓటును ఫారం-8 ద్వారా మార్చుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వివిధ అనుమతుల కోసం దరఖాస్తులు సువిధలో 48 గంటల ముందుగా సమర్పించేలా అవగాహన కల్పించాలన్నారు. అన్ని ఏఆర్ఓ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ లో అనుమతులకై సింగిల్ విండో కేంద్రం ఏర్పాటుచేయాలన్నారు. ఇవిఎం ల రవాణాకు అవసరం మేరకు 5 డిజిటి వాహనాలు సిద్ధం చేయాలన్నారు. సెగ్మెంట్ల పరిధిలో స్ట్రాంగ్ రూం లు సిద్ధం చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు ప్రణాళిక చేయాలన్నారు. అక్రమ నగదు, మద్యం, ప్రలోభాల జప్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సామాగ్రి సేకరణకు చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు వచ్చిన సామాగ్రి జాబితా, ఇంకనూ రావాల్సిన సామాగ్రి జాబితా సమర్పించాలన్నారు. పోలింగ్ సామగ్రి లో వెల్ ఫెర్ కిట్ కూడా ఇవ్వాలన్నారు. వచ్చే వారం అంతరాష్ట్ర సమన్వయ సమావేశం చేపట్టనున్నట్లు, అట్టి సమావేశానికి సంబంధిత అధికారులు హాజరవ్వాలన్నారు. అంతరజిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాల్లో పిఏ సిస్టం అమర్చాలన్నారు. ఎన్నికల్లో వాడే బస్సులకు జిపిఎస్ పరికరాల అమర్పులను పూర్తి చేయాలన్నారు. బఫర్ బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. ఫిర్యాదుల విభాగానికి ఫిర్యాదులు వచ్చేలా సి-విజిల్, 1950 నెంబర్లపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఎస్హెచ్ఓ లు యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి, సి-విజిల్ డౌన్లోడ్ లు చేయించాలని, యువతలో చైతన్యం తేవాలని అన్నారు. సువిధలో అనుమతుల విషయమై రోజువారి నివేదిక సమర్పించాలన్నారు. 5 మహిళా, 1 దివ్యాoగ, 1 యూత్ ప్రత్యేక పోలింగ్ కేంద్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సోషల్ మీడియా పై నిఘా పెట్టాలని, ఎన్నికల సంబంధ వదంతులపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌళిక సదుపాయాలకల్పన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూట్ మ్యాపులు, డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్ లే అవుట్ల సిద్ధం చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ముద్రణ పూర్తి చేయాలన్నారు. ఎపిక్ కార్డుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ మౌనిక, అదనపు డిసిపి ప్రసాద రావు, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top