EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అన్నదాతలను ఆదుకోవాలి : ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్

ఖమ్మం 31 -03 -2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, నలుబోల మధుశ్రీ.

ప్రభుత్వ వైఫల్యంతో తీరని గోస పడుతూ పంటలు ఎండిపోయి కన్నీటి పర్యంతమవుతున్న అన్నదాతలను తక్షణమే ఆదుకోవాలని ఖమ్మం బీఆర్ ఎస్ అభ్యర్థి ఎంపీ నామ నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు తో కలిసి ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో నామ మాట్లాడారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే ప్రజల , రైతుల గోస, కన్నీటి కష్టాలు చే ప్పనవికాకుండా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదన్నారు. తక్షణమే ఎకరాకు రూ.30 వేలు నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ కు అండగా ఉండి, పార్లమెంట్ ఎన్నికల్లో తనని గెలిపించాలని నామ కోరారు. విలేకరుల సమావేశంలో ఇంకా లింగాల కమలరాజు, శ్రీయుతులు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు,కోనేరు చిన్ని, కూరకుల నాగభూషణం, మేయర్ నీరజ, తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top