EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఖాళీ పోస్టుల భర్తీ దరఖాస్తుల ఆహ్వానం

31.3.2024 ఈ,తరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ నలుబోల మధుశ్రీ, ఖమ్మం.

ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి నందు ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీ పోస్టుల్లో ప్రొఫెసర్లు – 6, అసోసియేట్ ప్రొఫెసర్లు – 13, అసిస్టెంట్ ప్రొఫెసర్లు – 6, సీనియర్ రెసిడెంట్ – 18 లు ఉన్నట్లు ఆయన అన్నారు. ఇట్టి ఖాళీలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిన ఎంపిక చేయబడతాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఏప్రిల్ 3 న ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉదయం 10.00 గంటల నుండి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఖాళీలు, ఇతర వివరాలు కళాశాల వెబ్ సైట్ www.gmckhammam.gov, జిల్లా వెబ్ సైట్ https: khammam.telangana.gov.in నందు పొందుపర్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తులు ఆన్లైన్, ఆఫ్ లైన్ లోనూ స్వీకరిస్తారని ఆయన అన్నారు. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ ద్వారా జిల్లా సెలక్షన్ కమిటీ నేతృత్వంలో ఎంపిక చేసి, నియామకపు పత్రాలను అందజేయనున్నట్లు ప్రిన్సిపాల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top