jadcherla may15 (eetaram bharatam news);అంతరించిపోతున్న కళలను కాపాడాలని, గ్రామీణ జానపద కళాకారులను ప్రోత్సహించాలని, బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు.జడ్చర్లమండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో శ్రీకృష్ణ కళామండలి సభ్యుల సమావేశంలోబీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతుశ్రీకృష్ణ కళామండలి ఆధ్వర్యంలో చిరుతల శ్రీ మార్కండేయ విలాసం వీధి నాటకాన్ని గురువారం నాడు బూరుగుపల్లిగ్రామంలోప్రదర్శిస్తున్నట్ల బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి యాదవ్ తెలిపారు. అంతరించిపోతున్న కళలను కాపాడాలన్న ఉద్దేశంతోనే శ్రీకృష్ణ కళామండలి గ్రామీణ జానపద కళాకారులను ప్రోత్సహిస్తు భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చేరువ చేయిస్తున్నామని తెలిపారు,, మండల పరిసర గ్రామాలలోని, కళాకారులు, ప్రజలు, అధిక సంఖ్యలో హాజరై మార్కండేయ విలాసం వీధి నాటకాన్ని తిలకించివిజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రాచీన కళలకు జీవం పోస్తున్న కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో పంతులుగోరంట్ల మల్లేష్, మాజీ ఇంచార్జి సర్పంచ్ కృష్ణ కుమార్,గొడుగు శంకరయ్య,మేడిపూరి పెద్ద నర్సిములు, గోరంట్ల, రాంకొండ,చెన్న కేశవులు రామస్వామి, సత్యయ్య,జంగయ్య దుర్మయ్యశ్రీశైలం,,తదితరులు పాల్గొన్నారు















