EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అవకాశమిస్తే బిజెపి తరఫున ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తా తెలుగు రాష్ట్రాలకు దూరంగా లేను.. జయప్రద

తిరుమల ఏప్రిల్ 3 (ఈతరం భారతం న్యూ స్); బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఒకప్పటి అందాలతార జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ తాను యూపీలో ఉంటున్నా, తెలుగు రాష్ట్రాలకు దూరంగా లేనని, అవకాశమిస్తే బిజెపి తరఫున ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె మనసులో మాట బయటపెట్టారు. తెలుగువారికి సేవ చేయాలని ఉందన్నారామె.అందాలతార జయప్రద గురించి తెలియనివారుండరు. తెలుగు నటిగా వెండితెరపై వెలిగి, ఆ తర్వాత బాలీవుడ్ లోనూ జయకేతనం ఎగురవేసిన చక్కటి నటి ఆమె. ఎన్టీఆర్ ఆహ్వానంపై 1994లో తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. జయప్రద 1996-2002 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ ఆమె సేవలు అందించారు. ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీలో చేరి, 2004-14 మధ్య కాలంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె బిజేపీలో కొనసాగుతున్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top