EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కోస్తా అంతటా వర్షాలు పడే అవకాశం

 

విశాఖపట్నం నవంబర్ 14 (ఈతరం ఇండియా న్యూ స్) : అండమాన్ పరిసర ప్రాంతాలను అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పైనుంచి రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి 16వ తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తర్వాత తీవ్రవాయుగుండంగా మారుతుంది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావం వల్ల తమిళనాడులో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రేపు కోస్తా అంతట వర్షాలు పడే అవకాశం ఉంది. 16 17 తేదీల్లో ఉత్తర కోస్తా ఒరిస్సాలో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top