EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీ పునర్విభజన చట్టం పై ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ

అమరావతి జనవరి 30 (ఈ బీ న్యూ స్);: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చేయలేదని అంశాల వారీగా‌ వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పేర్కొన్న అపరిష్కృత వాగ్దానాలపై మీ దృష్టికి తీసుకువస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. విభజన జరిగిన ఒక దశాబ్దం తర్వాత కూడా ఏపీకి రాజధాని నగరం లేకుండా చేశారని లేఖలో తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఎన్నికల వాగ్దానాలను అమలు పరచలేదని వివరించారు.పదేళ్లు కావస్తున్నా నేటికీ ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. విభజన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారనేది వాస్తవమని చెప్పారు. నేడు, రాష్ట్రం గందరగోళం, నిస్సహాయత స్థితిలో ఉందన్నారు.ప్రత్యేక హోదా ఇస్తానని ఆనాటి ప్రధాని చెప్పారని.. ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఉందన్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా విస్మరించిందన్నారు. పర్యవసానంగా నేడు, AP పురోగతి, అభివృద్ధి లేకుండా పోయిందని వివరించారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రాజెక్టు జాతీయ హోదాను నీరుగార్చయని మండిపడ్డారు. పోలవరం రాష్ట్ర ప్రజల హక్కు అని… ఈ రోజు ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఈ అంశాలను 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తాము విజ్ఞప్తిని చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి ఈ వాగ్దానాలను నెరవేర్చాలని షర్మిల లేఖలో డిమాండ్ చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top