EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 424 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అమరావతి జనవరి 30 (ఈ బీ న్యూ స్ );ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లోని 424 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, లేటరల్‌ ఎంట్రీ ద్వారా భర్తీ చేయనున్నారు.సూపర్‌ స్పెషాలిటీలో 169, బ్రాడ్‌ స్పెషాలిటీలో 255 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశామని మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల పరిధిలోని మెడికల్‌ కాలేజీల్లోని 169 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6వ తేదీన విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.బ్రాడ్‌ స్పెషాలిటీల్లోని 255 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎం.శ్రీనివాసరావు సూచించారు. పూర్తి వివరాలకు https://dme.ap.nic.in/ , http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్‌సైట్లను సంప్రదించాలని అన్నారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top