EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఏపీ హైకోర్టు తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్‌ ఆలయ నిధులు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీని తప్పుపట్టిన కోర్ట్

 

తిరుమల డిసెంబర్ 13 (ఈతరం ఇండియా న్యూస్ ); : ఏపీ హైకోర్టు తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్‌ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది. టీటీడీ బోర్డు కు వస్తున్న నిధుల్లో ఒక శాతం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కేటాయిస్తామని ప్రకటించి అందులో భాగంగా వంద కోట్ల రూపాయలను మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పారిశుద్ధ్య పనులకు మళ్లించింది.ఈ చర్య సబబు కాదని పేర్కొంటూ బీజేపీ నాయకుడు భానుప్రకాశ్‌రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం కోర్టులో పిటిషన్‌ కేసు విచారణకు రాగా ఆలయ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని స్పష్టం చేసింది. సంబంధిత కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దని, టెండర్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు వారాల్లోగా టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిం

Related News

Select the Topic
Scroll to Top