ఏ ఆధారాలతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ను అక్రమంగా అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…‘‘గత 4-5 ఏళ్లుగా స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కార్పొరేషన్లు ‘కాగ్’ కు జగన్ ప్రభుత్వం అకౌంట్లు సమర్పించలేదు. 50 కార్పొరేషన్లకు పైగా కాగ్‌కు అకౌంట్లు ఎందుకు సమర్పించలేదు? ఆడిట్ జరగని ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై ఎలా నిందలేస్తారు? ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్‌కు ఎలాంటి ఆస్తులు లేకపోయినా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి మరీ అప్పులు తీసుకోవడం విచిత్రంగా ఉంది. చంద్రబాబుపైనే కేసులు పెట్టి జైలుకు పంపిన వారు మీపై కేసులు పెట్టి జైళ్లకు పంపరనే గ్యారంటీ ఎంటి? ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం ఎన్నో చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు’’ అని నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు.
















