EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఓటమి భయంతోనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని సీఎం జగన్ రెడ్డి

అమరావతి ఫిబ్రవరి 3 (ఈ బీ న్యూ స్);: సీఎం జగన్ రెడ్డి కు ఓటమి భయంతోనే అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాదరణతో వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక సునామీలో జగన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఓటు అనే ఆయుధంతో జగన్ రెడ్డికి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమన్నారు. దెందులూరు సభలో జగన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని విమర్శించారు. 57 నెలల్లో ఏపీని జగన్ సర్వనాశనం చేసి తమపై నిందలా? అని ప్రశ్నించారు.పన్నులు, ధరలు, ఛార్జీల పెంపుతో ప్రతి కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపిన పేదల ద్రోహి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు. అబద్ధాల పునాదుల మీద పాలన చేస్తున్న జగన్ రెడ్డి అర్జునుడు కాదు…భస్మాసురుడు అని ఆరోపించారు. యుద్ధానికి ముందే ఓటమి ఒప్పుకున్న పిరికిపంద జగన్ రెడ్డి అని దెప్పిపొడిశారు. బాబాయ్‌(వివేకా)ను చంపి, తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి మహిళా పక్షపాతినా? అని నిలదీశారు. మూడు రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతిని చంపేశాడని మండిపడ్డారు. ఏపీ జీవనాడి పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ఓటమి ఖాయమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

 

Related News

Select the Topic
Scroll to Top