EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కేంద్రం ఇచ్చిన కోట్ల రూపాయల నిధులు జగన్ జేబు లోకి వెళ్తున్నాయి

కోడుమూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుభరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.సిల్వర్ జుబ్లీ, త్రిపుల్ ఐటీ కళాశాలలకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం డ్యాం మరమ్మత్తులకు కేంద్రం విడుదల చేసిన రూ. 720 కోట్లలో ఎంతమేర పనులు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వలసల నివారణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వలస నివారణ కొరకు ఉపాధి హామీ కింద కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ పక్కదారి పట్టించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలపుడు రైతు పంటల మద్దతుధర స్ధిరీకరణ కోసం ఫండ్ ఏర్పాటు చేస్తానని హామీచ్చిన జగన్.. తర్వాత మాటతప్పడం వాస్తవం కాదా అని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏటా కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులు జగన్ జేబులోకి వెళ్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పురందేశ్వరి విమర్శించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top