EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం

అమరావతి జనవరి 23 (eetaram bharatam news);: రాజ్యసభ ఎన్నికల ముందు ఏపీ అసెంబ్లీ స్పీకర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేత, విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదలకు మద్ధతుగా రెండేళ్ల క్రితం గంట శ్రీనివాస రావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.రాజ్యసభ ఎన్నికల దృష్యా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఎత్తుగడులు వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి గూటికి చేరిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం

.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top