అమరావతి డిసెంబర్ 20 (ఈతరం న్యూ స్);: జగనన్న విదేశీ విద్యా దీవెన కార్యక్రమానికి, సివిల్స్ పురస్కారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… మంచి యూనివర్సిటీల్లో సీటు పోందితే ఫీజు ఎంతయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ ఏడాది 51మందికి అడ్మిషన్ ఇస్తున్నారని.. రూ.41.59 కోట్లు ఫీజులు ఇప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ద్వారా పొందిన ఈ సహయాన్ని మర్చిపోకుండా తిరిగి రాష్ట్రానికి కంట్రిబ్యూట్ చేయాలన్నారు. 408 మందికి నేడు ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలని యువత కలలు కంటుందని.. దీనికి కూడా మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. ఎవ్వరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే లక్ష రూపాయలు.. మెయిన్స్‌కు వెళితే లక్షన్నర ఇస్తున్నామన్నారు. 95 మందికి సివిల్స్ ప్రోత్సాహకం ప్రిలిమ్స్ కింద లక్షరూపాయలు, 11 మంది మెయిన్స్ క్లియర్ చేసిన వారికి లక్షన్నర అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎల్లయ్య, పుల్లయ్య కాలేజీలకు విద్యార్ధులను పంపించారన్నారు. అందుకే స్కీముల లో మార్పులు చేర్పులు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.
















