EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూలై 1 నుండి 3 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

ఈతరం భారతం తిరుపతి జూన్ 30 రిపోర్టర్ మనోజ్ కుమార్

తిరుపతి జూన్ 30: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుండి 3 వరకు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జూలై 1న సాయంత్రం 4.20 గంటలకు సత్యవేడు మండలం మదనపాలెం లోని హీరో మోటార్ కార్ప్ సంస్థ సైట్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారన్నారు. అనంతరం సాయంత్రం 4:50 గంటలకు హీరో మోటార్ కార్ప్ సంస్థ వారి రెండవ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమ అనంతరం శ్రీ సిటీ గెస్ట్ హౌస్ నందు రాత్రి బసచేస్తారని తెలిపారు. జూలై 02న ఉ.9.45 గం. సత్యవేడు మండలం మదనపాలెం వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ నుండి బయలుదేరి 10.05 గంటలకు ఓబులవారిపల్లి మండలం ముక్కావారి పల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారన్నారు. అనంతరం ఉ. 10.20 గంటలకు ముక్కావారి పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వి బి జి రామ్ జీ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమ అనంతరం హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని అన్నారు. తదుపరి మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతి తాజ్ హోటల్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర 2047 ఎకనామిక్ ఇంటలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.35 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ కు చేరుకొని రాత్రి బస చేయనున్నారని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top