EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టీడీపీ-జనసేన సీట్ల లెక్కలు తేలిపోయాయ్..

అమరావతి ఫిబ్రవరి 4 (ఈ బీ న్యూ స్);ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు బహిరంగ సభల్లో ఆ ఇరుపార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే.. సీట్ల పంపకం, అలాగే పొత్తుకు సంబంధించి కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో.. ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది. ఇన్నాళ్లూ కలిసిమెలిసి ఉన్న టీడీపీ- జనసేన.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయా? అనే వాదనలూ వినిపించాయి. తాజాగా వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ.. ఆ రెండు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మూడు గంటల పాటు ఈ భేటీ సాగింది.ఈ సందర్భంగా.. ఎవరెవరు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇరుపక్షాల నేతలు చర్చించారని, దీనిపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చారని తెలిసింది. టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి..? జనసేన ఎన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాలి..? అనే విషయంపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లేనని తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో.. దీన్ని బట్టి చేస్తే సీట్ల లెక్కలు తేలిపోయాయ్ అన్న మాట.

అంతా ఉమ్మడిగానే..!

అలాగే.. ఇటీవల పొత్తుకు సంబంధించి వచ్చిన కామెంట్లపై కూడా చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభలపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని.. వీటికి సంబంధించిన తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మరోవైపు.. ఐదు గంటల సమయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎంపీ బాలశౌరి జనసేనలో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే.. జనసేన పార్టీ కార్యాలయానికి వందల సంఖ్యలో జనసైనికులు తరలివచ్చారు.

 

Related News

Select the Topic
Scroll to Top