EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదా? ఐహెచ్అర్ఏ ఆంధ్రప్రదేశ్ సివిల్ రైట్స్ చేర్మెన్ కరణం తిరుపతి నాయుడు

గుంటూరు ఏప్రిల్ 8 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );ఏవరైనా తప్పు చేస్తే ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉందని,ఇదిరాజ్యాంగం కల్పించిన హక్కని ఐహెచ్అర్ఏ ఆంధ్రప్రదేశ్ సివిల్ రైట్స్ చేర్మెన్ కరణం తిరుపతి నాయుడు అన్నారు. తప్పు చేస్తే ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారు లను నిలదీయకూడదా? ప్రతిపక్షం. మీడియా ప్రశ్నించకూడదా’ అని యన ప్రశ్నించారు. కొద్ది మంది ఐఏ ఎస్, ఐపీఎస్ అధికారులు తప్పుచేస్తే వారి తప్పులను కప్పి పుచ్చుకోడానికి పోలీసు అధికారుల సంఘం తరపున ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు, మీడియాపై ఫిర్యాదు చేయడాన్ని తిరుపతి నాయుడు తప్పు బట్టారు.’ఎన్నికల సంఘమే 9 మంది ఐఏఎస్, ఐపీఎస్ అది కారులను ఎందుకు బదిలీ చేసిందని ప్రశ్నించారు. పల్నాడు, ప్రకాశం. చిత్తూరు ఎస్పీలు ఏం చేశారో ఎవరికీ తెలియదా? గన్నవరంలో తెదేపా కార్యాలయంపై దాడి చేసినాక్ వైనాన్ని పోలిసుల వైఫల్యాన్ని ప్రధాని సభలో దేశమంతా చూసారన్నారు.ఏం ఆధారాలు లేకుండా పత్రికలూ వార్తలు రాశాయి? ఏవరైనా ఏ ఆధారాలు లేకుండా పిర్యాదులు చేస్తారా అని ప్రశ్నించారు. చిలకలూరి పేటలో ప్రధాని సభలో జనాన్ని నియంత్రించడంలో పోలీసు అధికారులు విఫలం కాలేదా? సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మైకు ముందుకొచ్చి జనాన్ని నియంత్రించాలేదా? అక్కడున్న ఐపీఎస్ల ఘనత దేశం అంతా చూడలేదా? ప్రధానమంత్రి ప్రసంగానికే ఇబ్బందులు కలిగితే మీ అధికారులు ఏం చేస్తున్నారు? సాక్షాత్తూ ఎస్పీజీ, జడ్ ప్లస్ కేట గిరీ భద్రత ఉన్న ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరన్ కుమార్ రెడ్డి తదితరులు వేదికపై ఉన్న సభలో ఎలాంటి చర్యలు తెసుకున్నారని ప్రశ్నించారు.అమరావతి పర్య టనకు వెళ్లిన చంద్రబాబుపై కర్రలు, రాళ్లు విసిరితే మీ డీజీపీ భావప్రకటనా స్వేచ్చ అనలేదా? రాజమహేంద్ర వరంలో వరప్రసాద్ పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయలేదా? గంజాయి, డ్రగ్స్లో ఆంధ్రప్రదేశ్ నంబర్బన్ అవుతుంటే.. చిత్తూరులో చెక్పోస్టు వద్ద కాపలాగా ఉన్న కానిస్టేబుల్ను ఎర్రచందనం మాఫియా లారీతో ఢీకొట్టి చంపేస్తే మీరేం చేశారు? తీసుకోవాలో మీ డీజీపీకి నిఘా విభాగం అదనపు డైరక్టర్ జనరల్కు తెలియదా? ప్రధాని సభలో భద్రతా వైప ల్యంపై ఎవరూ ప్రశ్నించకూడదా? మీ కమిషనరేట్ పరిధిలోని నందిగామలో తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుదు మార్ వారి అనుచరులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి చంపబోతే సెక్షన్ 307 కింద కేసులు పెట్టకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపలేదా? ఇలాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికా రుల ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరగవనే బయన్దోలన ప్రజల్లో నలకోందని తిరుపతి నాయుడు పేర్కొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top