తిరుమల మార్చ్ 28 (ఈతరం భారతం న్యూస్ ):తిరుమల అలిపిరి మార్గం లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. నడకమార్గంలోని ఏడవ మెట్టు వద్ద చిరుత కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కాయి. ఈనెల 25, 26 తేదీల్లో నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించినట్టు అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో అలిపిరి నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు గుర్తించామన్నారు.ట్రాప్ కెమెరాకు చిరుతపులి కదలికలు చిక్కడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది, అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి అక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.















