EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పవన్ ప్రకటనతో అయోమయం లో టిడిపి క్యాడర్‌

అమరావతి, జనవరి 27 (ఈ బీ న్యూ స్):: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు గందరగోళానికి దారి తీసింది. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో తప్పని పరిస్థితుల్లో తాను కూడా రాజానగరం, రాజోలు నియోజకవర్గాల జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు నిన్న(శుక్రవారం) పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే పవన్ జనసేన అభ్యర్థుల ప్రకటన ఆ రెండు నియోజకవర్గాల టీడీపీ క్యాడర్‌ను షాక్‌కు గురిచేసింది.ఈ క్రమంలో శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజానగరం, రాజోలు నియోజకవర్గాల కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ ప్రకటనతో ఆ రెండు నియోజకవర్గాల కార్యకర్తలు హుటాహుటిన టీడీపీ కార్యాలయానికి తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడితో ఆ రెండు నియోజకవర్గాల టీడీపీ కార్యకర్తలు సమావేశమయ్యారు.రాజానగరం, రాజోలు సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తున్న దానిపై తెలుగు తమ్ముళ్లు అలకపూనినట్లు తెలుస్తోంది. మరోసారి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని అచ్చెన్నాయుడిని రాజోలు, రాజానగరం టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. రాజోలుకు గొల్లపల్లి సూర్యరావు, రాజానగరానికి బొడ్డు వెంకటరమణ చౌదరి ఇంచార్జిలుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ నేతల్లో ఆందోళన స్పష్టం కనబడుతోంది. పవన్‌ మరోసారి ఆలోచస్తారా?.. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆందోళనల ఆ రెండు నియోజకవర్గాల తెలుగు తమ్మళ్లో నెలకొంది

.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top