EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోంది : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు

తూర్పుగోదావరి, ఏప్రిల్ 5 (ఈతరం భారతం న్యూ స్);: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం పింఛన్లకు ఇవ్వాల్సిన రూ.13 వేల కోట్లను దారి మళ్ళించారని ఆరోపించారు. మార్చి 30న ఎన్నికల కమిషన్ పింఛన్ల విషయంలో ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు.వైసీపీ ప్రభుత్వం కావాలని పింఛన్ల విషయంలో వృద్ధులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. సైకో ముఖ్యమంత్రి వృద్ధులను ఇబ్బందిపెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. శవ రాజకీయాలు వైసీపీ డీఎన్ఏలో ఉన్నాయని విరుచుకుపడ్డారు. జూలైలో ఏప్రిల్ నుంచి మూడు నెలల పింఛన్లు ఒకేసారి ఇస్తానని నేను ప్రకటించటంతో ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న పింఛన్లు తీసుకునే సదుపాయం ఉందన్నారు. పింఛన్ల విషయంలో పేదలు ప్రాణాలు తీసిన ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి వైదొలగాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ కూడా జగన్‌పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top