చిత్తూరు. డిసెంబరు 14 ( ఐ ఎన్ ఎస్ న్యూస్): చిత్తూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు పోలీస్ ఔట్ పోస్ట్ ను చిత్తూరు జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి, ఐపీఎస్ ఈ రోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ ఇక్కడ త్వరలోనే పోలీస్ ఔటపోస్టు సేవలను ప్రారంభిస్తామని విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎల్లప్పుడు రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించామని తెలియజేసారు. భవన నిర్మాణానికి కృషి చేసిన అధికారులు మరియు సిబ్బందిని శాలువలు కప్పి జ్ఞాపికలను అందజేశారు.పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు పోలీస్ ఔటపోస్టు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆర్.ఐ ఎమ్.టి.ఓ మధుకి ప్రత్యేకంగా అభినందించారు.ఈ ప్రారంబొత్సవానికి అడిషనల్ ఎస్పీ ఎస్.ఇ.బి శ్రీలక్ష్మి,అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. జి.నాగేశ్వర రావు,పట్టణ డి.ఎస్పీ శ్రీనివాస మూర్తి,దిశా డి.ఎస్పీ జె.బాబు ప్రసాద్,ట్రాఫిక్ డి.ఎస్పీ విష్ణు రఘువీర్,ఏ.ఆర్ డి.ఎస్పీ మురళీధర్,ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ విశ్వనాథ రెడ్డి,ఈస్ట్ ఇన్స్పెక్టర్ గంగి రెడ్డి,డి.టి.సి ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు,క్రైమ్ ఇన్స్పెక్టర్ భాస్కర్,కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర నాయుడు,ఆర్.ఐ అడ్మిన్ నిలకంటేశ్వర రెడ్డి,రెండవ పట్టణ యెస్.ఐ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

















