విజయవాడ డిసెంబర్ 18 (ఈతరం ఇండియా న్యూ స్);: రాజకీయ పార్టీల మధ్య పొత్తులపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు కొత్త కాదన్నారు. బీజేపీ కూడా అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. భావ సారూప్యత ఉన్న పార్టీలు కలవడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. ప్రాంతం, రాష్ట్రం, దేశం మంచి కోరుకునే వారు కలుస్తారన్నారు. కొన్నిసార్లు పొత్తులపై కొంతమంది విమర్శలు చేస్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేస్తాయని కేశినేని నాని స్పష్టం చేశారు. ‘‘బీసీ లంటే నీతి, నిజాయతీతో పని చేసేవారు. మా గోగుల రమణ ఐదేళ్లు డిప్యూటీ మేయర్గా నిజాయితీ కి నిదర్శనంగా నిలిచారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, గూండాగిరీలు ఉన్న వాళ్లు బీసీలు కాదు. నిరుపేదలు అయినా క్యారెక్టర్ ఉంటే కాళ్లకు దండం పెడతాం. ప్రజలను పీడించి, అక్రమంగా వేలకోట్లు దోచుకున్న వారు బీసీలు కాదు. పార్టీ కోసం పనిచేసే బీసీలు విజయవాడలో చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారి గెలుపుకు నేనే పని చేస్తా’’ అని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు
















