EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ నేరస్థులుగా తిరగడం విచారకరం

అమరావతి మార్చ్ 28 (ఈతరం భారతం న్యూస్ ); : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ్ నేరస్థులు గా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జస్టిస్‌ ఎన్వీరమణకు అమరావతి రైతులు, మహిళలు, నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.అనంతరం ఎన్వీ రమణ మీడియాతో మాట్లాడారు. దాదాపు 1563 రోజులుగా అమరావతి రైతులు దీర్ఘకాలంగా ఉద్యమాలు చేయడం దక్షిణాధి రాష్ట్రంలో మొట్టమొదటిదని పేర్కొన్నారు. ‘ రైతులు రాజధాని కోసం తమ భూములు త్యాగం చేశారు. రైతుకు, భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డలకు ఉన్న సంబంధంలాంటిదని ’ పేర్కొన్నారు. అటువంటి పరిస్థితుల్లో భూములు కోల్పోవడం సామాన్య విషయం కాదని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని న్యాయం చేస్తారని, ఆలస్యంగానైనా న్యాయవ్యవస్థ లో రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యయం విజయవంతం కావాలని, విజయవాడ లో మంచి రాజధాని నిర్మాణం జరగాలని, రైతుల ఆందోళనకు తగిన ఫలితం లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top