విశాఖపట్నం, ఫిబ్రవరి 20: (ఈ బీ న్యూస్ ) టీడీపి యువనేత నారా లోకేష్‌కు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి… ‘‘పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ పీకలేకపోయారు… నువ్వెంత. పూరి గుడిసె నుంచి రాయల్ ప్యాలెస్‌లోకి ఎలా ఎదగగలిగావో చెప్పగలవా లోకేష్. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే 420…. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని నన్ను విమర్శిస్తారా.. నేను పాలు తాగి పెరిగితే… మాజీ ఎమ్మెల్యే గోవింద్ సారా తాగి పెరిగాడు.. సారా కాసుకుని పెరిగిన నా కొడుకులు అందరూ నన్ను విమర్శిస్తారా.. శంఖారావం అని పలకడం కూడా తెలియని మొద్దు లోకేష్. లోకేష్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న అంటూ.. మట్టి కుండలో పప్పు.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా వుంచాం. లోకేష్ తనంతట తానుగా వచ్చిన సరే లేకపోతే నేనే పంపిస్తాను. చంద్రబాబు లోకేష్‌లలో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపా. లోకేష్‌లా నేను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదు.. కష్టపడి క్రింది స్థాయి నుండి వచ్చిన వాడిని’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.















